top of page

 నా మార్గదర్శకులు

asd_edited.png

పూజ్య శ్రీ రాఘవేంద్రరావు (అయ్యగారు)
రాయచూర్, కర్నాటక.

అయ్యగారని ఆప్యాయంగా పిలవబడే పూజ్య శ్రీ రాఘవేంద్ర రావుగారు 1925 మార్చి 19న ఆంద్రప్రదేశ లోని నారాయణపేటలోని పాతపల్లిలో  జన్మించారు . వారి తండ్రి పేరు శ్రీ కిషన్ రావు మరియు తల్లి శ్రీమతి వెంకమ్మ. వారు వారి అక్కగారి కుమార్తెయైన శ్రీమతి ద్రౌపతి బాయిగారిని వివాహం  చేసుకున్నారు. వారికి  ముగ్గురు కుమారులు , నలుగురు కుమార్తెలు ఉన్నారు.

 

వారు సైన్స్ లో  మరియు మెకానికల్ ఇంజనీరింగ్ లో  బ్యాచిలర్ పదవిని పూర్తి చేసారు మరియు బీదర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ గ చేరారు. కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి, గుల్బర్గా, హసన్ వంటి వివిధ ప్రదేశాల్లో  సేవలందించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ రాయచూర్ ప్రిన్సిపాల్ గా  కూడా పనిచేసిన ఆయన చివరకు 1982 లో టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు బెంగళూరులో డిప్యూటీ డైరెక్టర్ గా  పదవి విరమణ చేశారు.

 

వినయపూర్వకమైన అన్వేషకుడు శ్రీ రాఘవేంద్ర రావుజీ సమర్థ సద్గురువులైన శ్రీ రామచంద్రజి మహారాజ్ ను 1955 అక్టోబర్ 22న షాజహన్‌పూర్  వద్ద ఆయన నివాసంలో కలిశారు.

 

మొదటి సమావేశం దైవీ ప్రేమగా మారింది మరియు అన్వేషకుడి యొక్క ఆంతర్యం గురువుగారి చేత గురువుగారివలే పరివర్తనము చెందింది.

గురువుగారి సద్దర్శనము తరువాత శ్రీ రాఘవేంద్ర రావుగారికి గురువుగారు వారి మొదటి లేఖలో ఈరీతిగా వ్రాశారు "అందరూ నన్ను చూడాలని వస్తారు కాని చూడకుండా తిరిగి వెళ్ళిపోతారు కాని మీరు నన్ను మీతో తీసుకెళ్లారు "

 

నిజమైన మానవునిగా మారడానికి సహజమార్గము నిశ్చయమైన మార్గమని మరియు మానవుడు పొందవలసిన ఏకైక లక్ష్యం అని ఆయన అందరికి చాటి చెప్పారు. వారు "సహజ మార్గ సమీక్ష " , " సహపధికుని పిలుపు " మొదలైన అనేక పుస్తకాలను రాశారు. వారు వివిధ ప్రదేశాలలో మరియు విదేశాలలో విస్త్రుతంగా పర్యటించి అనేక సత్సంగములలో పాల్గొని వేలాది అభ్యాసులకు మార్గదర్శనమిచ్చారు.

 

వారు హాజరైన చివరి సత్సంగము మార్చి 19,2006న తన 81వ పుట్టినరోజున రాయచూర్ ఆశ్రమంలో జరిగినది. తమ భౌతిక శరీరాన్ని 10 ఏప్రిల్ 2006న రాయచూర్ లోని తమ స్వగృహమునందు త్యజించినారు.

 

వారు సహజమార్గ పద్ధతి యొక్క వ్యక్తిత్వమై మరియు సాధన యొక్క సారమై గురువుగారి సామర్థ్యాన్ని నిరూపించారు . వారు తమ జీవితపు చివరి శ్వాసవరకు సద్గురువుగారి యొక్క నిజమైన సత్యాన్వేషకుడిగా మరియు శిష్యుడిగా కొనసాగినారు . వారు మాస్టర్ తో పాటు దివ్యలోకంలో కూడా నెలసివున్నారు.

bottom of page